Saturday, March 27, 2010

బృందావనం--చిరంజీవి--దండకారణ్యం

పోయిన ఆదివారం ఈ టివిలో BIG UGADI MUSIC AWARDS చూసారా??
సినిమాకి ప్రాణంలాంటి మ్యూజిక్ కి అవార్దులు ఇవ్వడం బాగుంది.
ఈ విషయంలో బిగ్ 92.7 FM  వారిని అభినందించి తీరాలి.

ఇక ఫంక్షన్ విషయానికి వస్తే....
సుమ,శేఖర్ బాష తమ వాఖ్యానంతో ఎప్పటిలాగే అలరించారు.
కోటి,R.P పట్నాయక్,తమ్మారెడ్ది భరద్వాజ న్యాయనిర్ణేతలుగా మరియు బిగ్ శ్రోతలు,ఈ టివి వీక్షకులు ఓట్లతో అవార్దులు ఎంపిక చేసారు.
అవార్దుల ఎంపిక బాగుంది.
జీవితకాల సాఫల్య పురస్కారం వేటూరి సుందరరామమూర్తి గారికి ఇచ్చి ఆయన కీర్తిలో ఇంకో కలికితరాయిని చేర్చారు.
ఈ అవార్డుని చిరంజీవి చేతుల మీదుగా అందజేసారు.అంతా హాయిగా జరిగింది.ఏం గొడవలు లేకుండా...చాన్నాల్లకి టాలీవుడ్ లో ఒక ఫంక్షన్ జరిగింది...ఎటువంటి అహాలకి తావు లేకుండా......
చివరగ వేటూరి మాట్లాడుతూ....చిరంజీవి బృందావనం వదిలి దండకారణ్యం వెల్లిపోయారని అన్నారు...తన 40 సం.ల సినీ జీవితంలో వెండి తెరని ఏలిన 2 హీరోలు (ఎన్టీర్,చిరు) ఇద్దరు బృందావనం వదిలి దండకారణ్యం వెల్లిపోయారని ...తాము ఇక్కడ ఉండిపోయామని ...అందరు వెల్లిపోతే తామేం చెయ్యాలని చమత్కరించారు...మొత్తం ఒకటే నవ్వులు....నాక్కూడా నవ్వొచింది....

ఎంతైనా చిరు...రాజకీయ యాత్రలో...
నాకు అప్పుడప్పుడు...
అందరివాడు కాస్తా ...కొందరివాడు అయ్యాడనడం నిజమే అనిపిస్తూ ఉంటుంది...

టాలీవుడ్ బృందావనం అవునో కాదో గానీ....
రాజకీయం మాత్రం దండకారణ్యమే....

చిరు ఎలా నెగ్గుకొస్తాడో....మునుముందు....

"In front there is Crocodile festival'