Friday, January 13, 2017

దేశం మీసం తిప్పుదాం.!!

సాయిమాధవ్ బుర్రా గారు,
అప్పుడు మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు. ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణి.
ఇంగ్లీష్ పదాలు పడకుండా ఏం రాసారండీ అసలు.
మీరు తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం :)
మచ్చుకు గుర్తున్నవి కొన్ని.. శాతకర్ణి నుంచి..

బడుగు జాతి కాదు, తెలుగు జాతి.
అథములం కాదు, ప్రథములం.

నువ్వు జన్మనిచ్చింది మారణహోమానికి ..

నేను ప్రథమపూజ చేస్తా అన్నది మా అమ్మకి కాదు.. 'అమ్మకి'.

ఓడించా, మారలేదు..క్షమించా, మారలేదు..వధించా, ఇక మారాల్సిన అవసరం లేదు..

ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇప్పుడు ఉనికి చాటుదాం.

శరణం అంటే రక్ష, రణం అంటే మరణశిక్ష..

నేను బొట్టుపెట్టింది నా భర్తకు కాదు, ఒక చరిత్రకి.

మనం కథలు చెప్పకూడదు. మన కథలు జనం చెప్పుకోవాలి.

తరుముదాం - తురుముదాం.

ప్రసవవేదనలో తల్లి పడే బాధ కన్నా, పిల్లాడి ఏడుపే అందరికి కావాలి.

మీరు వెలుగుని వెతుకుతున్నారు, నేను చీకటిని ఛేధించి వెలుగు నింపుతున్నా..

దేశం మీసం తిప్పుదాం.!!



No comments:

Post a Comment