శేఖర్ కమ్ముల సినిమా,
డాలర్ డ్రీంస్ నుంచి లీడర్ వరకు..
ఎన్ని సార్లు చూసినా బోరు కొట్టవు.. ఫ్యామిలీ మొత్తం కలిపి చూడచ్చు..
హీరోయిన్ కి కథలో ఇంపార్టెన్స్ ఉంటుంది.. అలాంటి అమ్మాయిలు మన లైఫ్లో కూడ ఎదురైతే బాగుండు అనిపిస్తుంది. :)
ఇంకా శేఖర్ గారి స్టైల్ గురించి ఐతే చెప్పానేలెం, అదొక ప్రపంచం, ఆయన సినిమా అంటే, మంచి కాఫి లాంటిదే కాదు, ఒక ప్రయాణం, ఒక మంచి ఫ్రెండ్ లా, ఒక మంచి పుస్తకం లా, మనతోనే కొన్నేళ్ళ పాటు ట్రావెల్ చేస్తుంది. మనిషిలో మంచే హీరో, పరిస్థితులే విలన్లు..
గోదావరి నా ఆల్ టైం ఫేవరెట్ మూవీ, గోదారి నదిపై నాకున్న మాములు ఇష్టం, ఆ సినిమా చూసాక ప్రేమ గా మారిపొయింది.. ఇప్పుడు నాకు మా ఊరి గోదారి ఒక మంచి ఫ్రెండ్.. చెప్పాలంటే ఇంకా చాల ఉన్నాయ్.. ఈ పొస్ట్ కి ఇంతే..
సున్నితమైన కథలు, చిరుజల్లులో, లంగాఓణీల్లో అమ్మాయిలు..
అచ్చమైన సిటీ తెలుగు లోగిల్లు... స్వచ్ఛమైన సంగీతపు త్రుళ్ళింతలు..
ఆలు చిప్స్ కన్నా రుచిగా, క్రిస్పీగా ఉండే మాటలు...
మనసుకు హత్తుకొనే భావాలు.... విలన్లు, రక్తాలు లేని సున్నిత కథలు..
ఇంతకన్నా ఏం కావాలి? శేఖర్ కమ్ముల గారికి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకోవడనికి?
శేఖర్ కమ్ముల |