Monday, November 28, 2016

జయమ్ము నిశ్చయమ్మురా - నా (రి)వ్యూ


ఈ దేశవాళీ వినోదం మాంచి రుచిగా ఉంది.
మంచి మెచ్యూర్డ్ ప్రేమకథ చాలా రోజులైంది చూసి. మధ్య తరగతి జీవితాలు, ఆ కామెడీ చూసి ఎస్వీ క్రిష్ణారెడ్డిగారు గుర్తొచ్చారు.

మూఢ నమ్మకాలు, వాస్తు, జ్యోతిష్యాలు కాదు, ముందు మనలోని ఆత్మస్థైర్యమే మనకి జయాన్ని సిద్ధిస్తుంది అని హీరో కారెక్టర్ ద్వారా చెప్పడం, ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని ఎత్తి చూపడం లాంటివి సినిమాలో పెట్టడం వలన సామాజిక బాధ్యతని అంతర్లీనం చేసారు.


మొదటి సినిమానే చాలా బాగా తీసారు దర్శకుడు శివరాజ్ కనుమూరి , నిర్మాత కూడా ఆయానే. నిజంగా మెచ్చుకోవాలి ఆయన ప్రతిభకి, ధైర్యానికి. రాజోలు అబ్బాయి. ఆయ్ మన తూగోజినే ;)

మొత్తానికి జంధ్యాలగారి సినిమా పేరు పెట్టుకుంన్నదుకు చింతపడేలా చెయ్యలేదు. మళ్ళీ మళ్ళీ చూసే సినిమా తీసారు.
 పూర్ణ 'అవును' తర్వాత మళ్ళీ తనని ప్రూవ్ చేసుకుంది. శ్రీనివాసరెడ్డి జీవించాడు.


మిగతా తెలుగు సినిమాల్లోలా హీరో అమ్మాయిలని ఏడిపించడాలు, పంచ్ డైలాగులు, ఫైట్లు లాంటివి మాత్రమే చెయ్యాలి అనుకొనేవారు ఈసినిమా దయచేసి చూడకండి. :v