Saturday, September 25, 2010

దబాంగ్ టీంలో 3 ఇడియట్స్

సరైన సినిమాల్లేక....
ఉత్తరాదిన భారీ వర్షాలతో....
కలక్షన్ల వాన మందగించిన బాలీవుడ్ లో "దబాంగ్"తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ అగ్ని రాజుకుంది.

చడీ చప్పుడు లేకుండా వచ్చిన ఈ సినిమా ఇంత సీను క్రియేట్ చేస్తుందని ఎవరూ ఊహించి కుడా ఉండరు.

అయినా ఓవర్ హైప్ తో వచ్చిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర చతికిల పడటం చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు ఈ కొత్త మంత్ర -చడీ చప్పుడు లేకుండా - విడుదల చెయ్యడం మొదలైంది అని చెప్పుకోవచ్చు.





దీనికి ఉదాహణ ఈ దబాంగ్, చాలా కాలంగా మాస్-మసాల సినిమాలు లేకపోవడంతో...ప్రేక్షకులు ఒక్కసరే దీనిపై పడ్డారు.
దెబ్బకి రిలీజ్ ఐన మొదటి వారంతం 48.5కోట్లు రాబట్టి 3 ఇడియట్స్ రికార్డును తిరగరాసింది.
దీనికి కొత్త లుక్ (మీసం గమనించారా?)తో చుల్బుల్ పాండే అలియాస్ రాబిన్ హుడ్ గా సల్మాన్ నటనతో పాటు ... లాంగ్ వీకెండ్ కుడా కారణం అని విమర్శకులు విశ్లేషిచారు.ఇది తప్పని సినిమాలో నిజంగానే పస ఉందని తరువాతి వారం కలక్షన్లు నిరూపించాయి.

ఇప్పటికి మూవీ 3 ఇడియట్స్ కన్నా 30% ఎక్కువ కలక్షన్లతో నడవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
నిజానికి దాబాంగ్ టీం కూడా ఇంత పెద్ద సక్సెస్ ఊహించలేదని ..ఈ మద్య ఇచ్చిన ఇంటర్వూలో సల్మాన్ ఖాన్ బ్రదర్ నిర్మాత అర్బాజ్ ఖాన్ అన్నారు.
అవును మరి ఒక కొత్త డైరెక్టర్ తన మొదటి సినిమాకి ఇంత మానియా క్రియేట్ చేస్తాడని ఎవరు ఊహిస్తారు ?

ఇంతకి దబాంగ్ వలన్ ఇడియట్స్ అయ్యింది ఎవరని మీ అనుమానం కదా...
3 ఇడియట్స్ అనేది సక్సెస్ కి మారు పేరుగా మారింది ...మరి విజయన్ని మొదటి సినిమాకే అందుకున్న త్రయం ... అదేనండి..
ప్రొడ్యూసర్ - అర్బాజ్ ఖాన్
దర్శకుడు - అభినవ్ కాశ్యప్
హీరోయిన్ - సోనక్షి సిణ్హా

మన 4వ ఇడియట్ సల్మాన్ .....

వీళ్లందరికి ఇది పార్టీ టైం....

ఎందుకంటే దబాంగ్ మొదటి 10 రోజుల్లో 106.24 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా పుస్తకంలో గిన్నీస్ స్తాయి రికార్డు కెక్కింది ...

2 comments:

  1. ee cinemaa ki arbaaj, abhinav, sonakshi kanpinche moodu idiots ayite...kapinche naalugo idiottera salman..aah...(sai kumar voice)

    ReplyDelete
  2. అవునండి...భలే చెప్పారు కుమార్ గారు..:)

    ReplyDelete